పాలన స్తంభన: చీలిన మంత్రివర్గం, సిఎంపై జానా ఫైర్

Jana Reddy and Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన వ్యవహారంతో రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయానికి రావడం లేదు. ఆయన క్యాంప్ కార్యాలయంలోనే ఉంటున్నారు. మంత్రులు కూడా చాలా మంది సచివాలయానికి రావడం లేదు. దానికితోడు, రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాంతాల వారీగా నిలువునా చీలిక వచ్చింది. సోమవారం తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకుని పరోక్ష విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించడం పట్ల తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని జానా రెడ్డి ముఖ్యమంత్రిని ఎత్తిచూపకుండా విమర్శలు చేశారు.

శనివారంనాడు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర శాసనసభ్యులతో సమావేశమై, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ తీర్మానం చేయడాన్ని, దానిపై బొత్స సంతకం చేయడాన్ని కూడా తెలంగాణ నాయకులు తప్పు పడుతున్నారు. 2009 డిసెంబర్ పునరావృతమైతే తెలంగాణ ఈసారి రగిలిపోతుందని, పార్టీ అధిష్టానం విభజన ప్రకటన చేసినందున సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని జానా రెడ్డి అన్ారు.

విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర నాయకులు ఒత్తిడి చేయడం కొనసాగిస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆయన అన్నారు. శానససభలో తీర్మానం ప్రతిపాదిస్తే విప్ జారీ చేయబోమని బొత్స చెప్పిన మాటలపై ఆయన ఆ విధంగా స్పందించారని అంటున్నారు.

సిఎం, డిజిపి అదుపు చేయాల్సినవారని, రెచ్చగొట్టేవారు కాదని, వారు రెచ్చగొట్టడం సాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జానా రెడ్డి అన్నారు. మంత్రిగా తాను ఎవరికీ తక్కువ కానని, ప్రజల ఉద్వేగాలను తాను ముఖ్యమంత్రికి చెప్తానని, మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని పట్టుబడుతానని ఆయన అన్నారు. హైపవర్ కమిటీ కూడా రాష్ట్ర విభజనపై పునరాలోచనకు కాదని, హైదరాబాద్‌పై, రెవెన్యూ పంపకాలపై చర్చించడానికేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+