టీపై ఒత్తిడికి లొంగదు: విహెచ్, షర్మిలకు వార్నింగ్

కేంద్రం నిర్ణయం ప్రకారం పదేళ్ళ వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత ఎవరు మటుకు వారు అన్నదమ్ములా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.
ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని వీమెచ్ సూచించారు. రాష్ట్ర విభజనకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. నీళ్లు, విద్యుత్, ఉద్యోగాలు తదితర వాటి సమస్యలపై చర్చించి పరిష్కరించుకోవచ్చునని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఒకే ప్రాంతానికి నాయకులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమైక్యాంధ్ర ఇవ్వాలన్న లేఖపై సంతకం పెట్టడం బాధాకరమని హనుమంతరావు అన్నారు.
హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే షర్మిలను తరిమికొడతామని టీఆర్ఎల్‌డీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ రియాజ్ హెచ్చరించారు. సీమాంధ్రలో జాతీయ నేతల విగ్రహాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే కూలుస్తున్నారని, అటువంటి చర్యలు మానుకోకపోతే తెలంగాణలో వైఎస్ విగ్రహాలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications