అమ్మాయిపై వేధింపులు: జర్నలిస్టుపై నిర్భయ కేసు

Nirbhaya case against scribe for harassing girl
హైదరాబాద్: ఓ విద్యార్థినిని వేధించినందుకు, ఆమె బంగారు గొలుసను దొంగిలించినందుకు ఓ టీవీ చానెల్ స్థానిక విలేకరిపై మేడ్చెల్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా దౌలతాబాద్‌కు చెందిన శశాంక్ రెడ్డి అన ే 23 ఏళ్ల యువకుడు గజ్వేల్ నుంచి ఓ తెలుగు న్యూస్ చానెల్‌ కాంట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు.

వివరాలు ఇలా ఉన్నాయి - మేడ్చెల్‌ బి - ఫార్మాసి రెండో చదువుతున్న అమ్మాయిని గత మూడు నెలలుగా అతను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం అతను కాలేజీ వద్దకు వచ్చి తన బైక్‌ మీద కూర్చోవాలని చెప్పాడు. ఆమె నిరాకరించడంతో మెడలోని బంగారం గొలుసును లాక్కుని పారిపోయాడు.

రెండు గంటల తర్వాత అతను షాపూర్‌లోని అమ్మాయి ఇంటికి వెళ్లాడు. పెట్రోల్ పోసి తగులబెడుతానని బెదిరించాడు. అయితే స్థానికులు గుమికూడి అతన్ని చితకబాదారు. దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. శనివారం రాత్రి అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు మేడ్చెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు శశాంక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శశాంక్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+