నిర్ణయం తీసుకున్నాం, తగ్గేదిలేదు: టిపై సోనియా

మీ ప్రాంత సమస్యలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు వచ్చే ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. సమస్యలను వినేందుకే తాము ఆంటోని కమిటీని వేసినట్లు చెప్పారు. ఆంటోనీ కమిటీ ముందు మీ సమస్యలు, అభిప్రాయాలు అన్ని చెప్పాలని ఆమె చెప్పారు. కాగా ఈ సమయంలో కోట్ల విభజన ద్వారా వచ్చే సమస్యలను సోనియా ముందు పెట్టారు.
చిద్దూను కలిసిన కేంద్రమంత్రులు
కేంద్రమంత్రి చిదంబరంను సీమాంధ్ర మంత్రులు మధ్యాహ్నం కలిశారు. తమ ప్రాంత సమస్యలు చెప్పే వరకు ప్రకటించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని, హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పించాలని తాము చిదంబరాన్ని కోరినట్లు కేంద్రమంత్రి జెడి శీలం చెప్పారు.
ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీలతో కూడిన కాంగ్రెసు పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని, దాని ముందు తమ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాదనలు వినిపిస్తారన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్య నిర్ణయం వెలువరించాలని తాము చిదంబరాన్ని కోరామన్నారు. చిద్దూను కలిసిన వారిలో పురంధేశ్వరి, పల్లం రాజు, జెడి శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి తదితరులు ఉన్నారు. సీమాంధ్ర నేతలు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిని కలువనున్నారు. ప్రధానమంత్రి అపాయింటుమెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications