ఎప్పుడింతే: కాంగ్రెస్‌పై బాబు, సిఎం దొంగలా..: తలసాని

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంతేనని, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆ పార్టీకి ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. రాష్ట్రం అనిశ్చిత స్థితిలో ఉందని, ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టిందన్నారు.

వర్షాకాలంలోని విద్యుత్ సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రానికి చేనేత కోసం ఇద్దరు మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదన్నారు. కావూరి సాంబశివ రావు ఉన్నా ఉపయోగించుకోవడం లేదన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని, తాము అధికారంలోకి వస్తే చేనేత డిక్లరేషన్ అమలు చేస్తామని, ఆప్కోను పటిష్టం చేస్తామని చెప్పారు.

సిఎం దొంగలా...: తలసాని

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొంగలా వారం రోజులుగా బయటకు రావడం లేదని మాజీ మంత్రి, టిడిపి హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ముగ్గురితో మాట్లాడి ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అందరికీ సమన్యాయం చేస్తేనే కదా ఇరు ప్రాంతాలు కలిసి ఉండేది అన్నారు.

ఢిల్లీకి వెళ్తాం: విప్ పద్మరాజు

ఈ నెల 11వ తేదీన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఢిల్లీకి వెళ్తామని శాసన మండలి విప్ పద్మరాజు అన్నారు. ఆంటోనీ కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామన్నారు.

ఎమ్మెల్యే రాజీనామా

సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు రాజీనామా చేశారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+