విభజనపై హైపవర్ కమిటీ, విభజన కష్టమైన పని: డిగ్గీ

ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది ఈ రోజు ప్రకటించారు. అయితే తెలంగాణ ఏర్పాటుపై అభ్యంతరాలను వినడానికి మాత్రమే ఈ కమిటీ ఏర్పాటయినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రులు తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. ఈ కమిటీ కాలపరిమితిని చెప్పలేదు. అయితే సాధ్యమైనంత త్వరగా దీనిని పూర్తి చేయాలని కమిటీకి సూచించినట్లుగా సమాచారం. మరోవైపు సీమాంధ్ర నేతలు చెబుతున్నట్లుగా కమిటీ నిర్ణయం వచ్చేదాగా తెలంగాణ ప్రక్రియ ఆగుతుందని పేర్కొనలేదు.
సీమాంధ్రకు అన్యాయం జరగదు: డిగ్గీ
సీమాంధ్ర ప్రాంతం వారికి అన్యాయం జరగకుండా చూస్తామని ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం చెప్పారు. కుటుంబంలాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడం చాలా కష్టమైన పని అన్నారు. ఎపిఎన్జీవోలు సమ్మెకు వెళ్లవద్దని కోరారు. ఆంటోనీ కమిటీ ఎదుట సీమాంధ్రులు తమ వాదన వినిపించుకోవచ్చునని చెప్పారు. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. అన్ని సంఘాలు ధర్నాలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్య ఎప్పటి నుండో ఉందని, అందుకే సిడబ్ల్యూసి తీర్మానం చేసిందన్నారు.
మేనిఫెస్టో అమలు కమిటీ
ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీని కూడా నియమించింది. ఇందులో ఎకె ఆంటోనీ, వి నారాయణ స్వామి, దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, గీతా రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, తిరువనక్కరసు, ఇంఛార్జులుగా ఉన్న ఏఐసిసి కార్యదర్శులు ఉన్నారు.
కాగా ప్రభుత్వం సభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశ పెట్టింది. బిల్లు కోసం కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేసింది. వచ్చే వారం ఆహార బిల్లు ఓటింగుకు వచ్చే అవకాశముంది. ఈ బిల్లును అన్నాడిఎంకె వ్యతిరేకిస్తోంది. ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్దమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications