సిఎం వ్యతిరేకిస్తున్నారు: కిషన్, వెనక్కి నడుస్తూ నిరసన

తెలంగాణ కోసం తమ పార్టీ అగ్రనాయకత్వం సైతం పోరాడిందన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటే తమకు సమ్మతమే అన్నారు. తెలంగాణకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు సహా అన్ని పార్టీలు ఆమోదించాయన్నారు. ఇప్పుడు ఇతర పార్టీలు సీమాంధ్రలో బిజెపిని తప్పు పట్టడం సరికాదన్నారు. ప్రజలను ఎవరూ రెచ్చగొట్టవద్దన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అన్ని పార్టీలు ప్రజలను మెప్పించి ఒప్పించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. వచ్చ ఎన్నికలలో రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెసు హడావుడిగా నిర్ణయం తీసుకుందని తాము భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలో జెఏసిది కీలక పాత్ర అన్నారు. సొంత పార్టీలోనే కాంగ్రెసు విభజనపై ఏకాభిప్రాయం తేలేకపోవడం దురదృష్టకరమన్నారు.
వైద్య విధాన పరిషత్ భవన్‌లో ఉద్రిక్తత
వైద్య విధాన పరిషత్‌లో ఎపిఎన్జీవో, టిఎన్జీవోలు సమైక్యాంధ్రకు, తెలంగాణకు అనుకూలంగా పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సచివాలయంలో ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం వెనక్కి నడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి శ్రమ: టిడిపి
హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలుగు వారి అందరి శ్రమ ఉందని టిడిపి ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్ న్యూఢిల్లీలో అన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించడం వదిలి జఠిలం చేస్తున్నారని, సీట్లు, ఓట్ల కోసమే తెలుగు ప్రజల మధ్య కాంగ్రెసు పార్టీ చిచ్చు పెట్టిందన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం అగదన్నారు. ఆంధ్రా ప్రజలు పోరాటం చేస్తుంటే పార్టీ పరమైన కమిటీ వేసి పరిష్కరిస్తామనడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ కమిటీతో వచ్చేదేమీ లేదని, ఆ పార్టీని నమ్మవద్దని ప్రజలను కోరారు.


Click it and Unblock the Notifications