సోనియా ఆదేశానికి టిడిపి ఎంపీలు నో, శ్రీకాంత్ నిప్పులు

Sonia Gandhi and Siva Prasad
న్యూఢిల్లీ/హైదరాబాద్: పార్లమెంటులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలను తెలుగుదేశం పార్టీ ఎంపీలు పట్టించుకోలేదు. ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్‌లు లోకసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా ఎదుట నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్సించారు. పక్కకు వెళ్లమని వారిని సోనియా ఆదేశించారు. ఆమె ఆదేశాలని వారు పట్టించుకోలేదు. దీంతో కేంద్రమంత్రి మునియప్ప వారిని బలవంతంగా పక్కకు తీసుకు వెళ్లారు.

ఉభయ సభల్లో టిడిపి నేతలు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభానికి ముందు నీళ్లు, ఉద్యోగాల పైన స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఉద్యమం రగులుతోందని, ప్రధానమంత్రి మాత్రం బొమ్మలా కూర్చున్నారని మండిపడ్డారు.

కాగా సోనియాతో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు భేటీ అయ్యారు. మరోవైపు విభజన హోరెత్తడంతో ఉభయ సభలు మరోసారి వాయిదాపడ్డాయి. లోకసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ కూడా మరోసారి వాయిదా పడింది.

శ్రీకాంత్ రెడ్డి నిప్పులు

రాయలసీమను చీల్చితే చూస్తూ ఊరుకోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెసు ఇప్పుడు రాయల తెలంగాణ పేరుతో జిల్లాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని తాను టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను తాను చేతులు జోడించి అడుగుతున్నానన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు భయపడే విభజన చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+