సోనియా వల్లనే: డిఎస్, ఎన్డీయే తిరస్కరించిందని డిగ్గీ

సీమాంధ్ర ప్రజలు, నాయకుల పైన తమకు ఎలాంటి విద్వేషం లేదన్నారు. వారు తమ సోదరులే అన్నారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణపై కాంగ్రెసు వెనక్కి పోదన్నారు.
ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని ఎపి రెవెన్యూ ఉద్యోగులు అన్నారు. వారు సిఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం మాట్లాడారు. చివరి ఎంపి రాజీనామా చేసే వరకు తమ సమ్మె కొనసాగుతుందన్నారు.
ఎన్డీయే తిరస్కరించింది: డిగ్గీ
1999లో 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండుతో వెళితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం తిరస్కరించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వేరుగా అన్నారు. అన్ని పార్టీలను సంప్రదించాకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
విభజనపై వ్యతిరేకత నిజమేనన్నారు. అన్ని సమస్యలకు కాంగ్రెసు పార్టీ పరిష్కారం చూపుతుందన్నారు. విభజన క్లిష్టమైనదే అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications