నేనేం చేయలేను: విభజనపై కావూరి, వైయస్సే: ఆనం

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ/నెల్లూరు: విభజన విషయంలో తాను ఏమీ చేయలనని కేంద్ర జౌళీ శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు బుధవారం అన్నారు. తాను ఈ విషయంలో హెల్ప్‌లెస్ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనళ్లో సమైక్యవాదులు తనను విమర్శించడాన్ని అర్థం చేసుకోగలనని, దాని గురించి తనకు ఆందోళన లేదన్నారు.

టి ఆజ్యం వైయస్సే: ఆనం

రాష్ట్ర విభజనకు జీజం వేసింది దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డేనని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్ర విభజనపై 40 మంది శాసన సభ్యులతో చిన్నారెడ్డి నాయకత్వంలో అధిష్ఠానానికి వైయస్ లేఖ పంపారని గుర్తు చేశారు. అనంతరం వేర్పాటువాదానికి మద్దతుగా తెరాసతో పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనేనన్నారు.

వైయస్ బాటలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నడిచారన్నారు. 2009 ఎన్నికల్లో వేర్పాటువాదానికి అనుకూలంగా కెసిఆర్‌తో కలిసి టిడిపి పోటీ చేసిందన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అఖిల పక్ష భేటీలో వేర్పాటువాదానికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడంతో చివరగా కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిగా నిలపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండటం నీచమన్నారు.

దేశ సమగ్రతకు పాటుపడిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాల్పడుతుండటం దౌర్భాగ్యమని, ఆ పార్టీలో విష పురుగులు ఉన్నందునే ఇలా జరుగుతోందన్నారు. ఇప్పటికే కొంత మంది జైల్లో, కొంత మంది బయట మగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఉద్యమాల పేరుతో దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు కాంగ్రెస్ నేతలంతా కట్టుబడి ఉన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+