వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య ఉద్యమం: మంత్రి తోట నర్సింహం రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Thota Narasimham
హైదరాబాద్/రాజమండ్రి: సమైక్యాంధ్ర కోసం మంత్రి తోట నర్సింహం గురువారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. యూపిఏ, సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు రాజీనామాలు చేస్తున్నారు.

తరిమికొడతారు: విశ్వరూప్

పార్టీలకతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని మంత్రి విశ్వరూప్ గురువారం పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు నేతలు ఈ నెల 12వ తేదీలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీ విభజనను తెర పైకి తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే తోట త్రిముర్తులు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆయన కాకినాడ వరకు పాదయాత్ర చేపట్టారు.

ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, తోట నర్సింహం, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులు కలిశారు. కిరణ్‌ను కలిసిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పొన్నాల లక్ష్యయ్య కూడా ఉన్నారు.

English summary
Ministers Thota Narasimham was submitted his resignation to CM Kiran Kumar Reddy on Thursday to support Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X