హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్దార్ పటేల్ లేకుంటే హైదరాబాద్ పరిస్థితేంటి?: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Patel liberated Hyderabad: Modi
హైదరాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏమై ఉండేదని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఆయన హైదరాబాదులోని నారాయణగూడ కేశవ మెమోరియల్ పాఠశాలలో పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.

పటేల్ విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. దేశాన్ని సమైక్యం చేసిన ఘనత ఆయనదే అన్నారు. అలాంటి వ్యక్తి అందరికీ ఆరాధ్యనీయుడన్నారు. చాణక్యుడి వంటి రాజనీతిజ్ఞత పటేల్‌లో ఉందన్నారు. దేశంలోని సంస్థానాల విలీన ప్రక్రియను నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ.. పటేల్‌కు అప్పగించారన్నారు.

అదే లేకుండా హైదరాబాద్ పరిస్థితి ఏమిటన్నారు. దేశంలోని అన్ని సంస్థానాల విలీన బాధ్యతను పటేల్‌కు అప్పగించిన నెహ్రూ.. జమ్మూ కాశ్మీర్‌ను మాత్రం తాను చూశారన్నారు. విలీనం చేయించడంలో నెహ్రూ విఫలం చెందడం వల్లనే ఇప్పటికీ అక్కడ సమస్య రగులుతోందన్నారు.

నాటి నుండి జమ్మూ వ్యాలీ సమస్యలో ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పటేల్ ఉంటే బాగుంటుందనిపిస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పండిట్స్ ఇళ్లు వదిలి వీధులలో బతుకు ఈడుస్తున్నారన్నారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు పటేల్ పదే పదే తనకు గుర్తుకు వస్తుంటారన్నారు.

English summary
Gujarat CM Narendra Modi on Sunday said that Sardar Vallabhai Patel was liberated Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X