విద్యార్థిని మృతి: సెల్‌ఫోన్ మాట్లాడుతూ పడిపోయి..

మోహినీ మిశ్రా లక్నోకు చెందిన విజయ్ కుమార్ మిశ్రా కూతురు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని దక్షిణ క్యాంపస్‌లో నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనం నాలుగో అంతస్థులో అమెతో పాటు ఏడుగురు మిత్రులు పార్టీ చేసుకున్నారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలున్నారు.
ఫ్రెషర్ పార్టీ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు ఎనిమిదో మహిళా హాస్టల్‌లో ఉండే మోహనీ మిశ్రా ఇతర అమ్మాయిలతో కలిసి క్లాస్ గెట్ టుగెదర్‌కు ఇక్కడికి వచ్చింది. ఏర్పాట్ల గురించి చర్చిస్తూ వారంతా స్నాక్స్ తీసుకున్నారు, మద్యం కూడా సేవించారు. అయితే, మోహినీ మిశ్రా మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు.
అందరూ కలిసి వినోదిస్తుండా ఫోన్ కాల్ రావడంతో మోహినీ మిశ్రా పక్కకు వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ టెర్రాస్ చివరి అంచుకు వచ్చి, కింద పడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications