నిన్ను పదిరోజుల్లో చంపేస్తాం: కెసిఆర్‌కు బెదిరింపు లేఖ

ఈ లేఖ సాయంత్రం తమ కార్యాలయానికి తపాల శాఖ ద్వారా చేరినట్లు పేర్కొంది. అయితే ఎవరు? ఎక్కడి? నుంచి ఈ లేఖను పంపించారనే వివరాలు అందులో లేవని చెప్పారు. ఈ లేఖ సీల్డ్ కవర్‌లో వచ్చింది. కాన్ఫిడెన్షియల్, అర్జంట్ అంటూ లేఖ పైన మార్క్ చేశారు.
కెసిఆర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఇతర ఎమ్మెల్యేలు మంగళవారం రోజు డిజిపి దినేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే కెసిఆర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల తెరాస నేతలు చెప్పిన విషయం తెలిసిందే. కెసిఆర్‌కు బెంగళూరు వంటి ప్రాంతాల నుండి బెదిరింపు ఫోన్స్ వచ్చాయని, కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినప్పటి నుండి వస్తోందని వారు గతంలో చెప్పారు.












Click it and Unblock the Notifications