టిడిపికి మోడీ కన్నుకొట్టారు, నిందలేస్తే..: నారాయణ

మోడీ మాయలో చంద్రబాబు పడరని తాము భావిస్తున్నామన్నారు. కాంగ్రెసు, బిజెపిలతో సిపిఐకి భవిష్యత్తులో పొత్తులుండవని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతలు ఆంధ్ర ప్రదేశ్ గౌరవాన్ని మంటగలిపారన్నారు. విడిపోయి కలిసుందామని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్‌లు తమ పైన నిందలు వేస్తే ఊరుకునేది లేదన్నారు.
విభజనపై తమ పార్టీలో ద్వంద్వ వైఖరి లేదన్నారు. తాము అసమర్థులమని కాంగ్రెసు నేతలు ఒప్పుకుంటే సీమాంధ్రకు ఏం కావాలో దానికి మద్దతుగా తాము లేఖ రాస్తామని చెప్పారు. తెలంగాణ ఇవ్వాలనడంతో పాటు సీమాంధ్రులకు న్యాయం కూడా కావాలన్నారు. లగడపాటి వంటి నేతలు తమ పైన నిందలు వేస్తే నోట్లో నాలుకలుండవని హెచ్చరించారు.
రెండు లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి.. రెండు లేదా మూడు రాజధానులు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి టిజి వెంకటేష్ వేరుగా అన్నారు. సీమాంధ్రలో ఆందోళన వల్లనే తెలంగాణ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఈ ఉద్యమమే లేకుంటే తెలంగాణ ప్రక్రియ జరిగేదన్నారు. ఉద్యమ తీవ్రత ఢిల్లీని కదిలించిందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్నో ముక్కలు చేయాల్సి వస్తుందన్నారు. అంటోని కమిటీకి నివేదిక ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలాంటి నివేదిక ఇవ్వాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
వాణికి విశ్వరూప్ మద్దతు.. చిరు రాజీనామాకు డిమాండ్
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న మంత్రి తోట నర్సింహం సతీమణి తోట వాణికి మంత్రి విశ్వరూప్ సంఘీభావం తెలిపారు. ఆమె దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమైక్యవాదులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications