హరిపై అసహనమా, చిరంజీవి ఏంచెప్తారు?: నన్నపనేని

రాజీనామా చేస్తే పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు మాట్లాడేందుకు అవకాశముండదని కేంద్రమంత్రులు చెప్పారని, అలాంటప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు గైర్హాజరయ్యారన్నారు. కేంద్రమంత్రులు జెడి శీలం, చిరంజీవి, పనబాక లక్ష్మీ, కావూరి సాంబశివ రావు, దగ్గుపాటి పురంధేశ్వరిలు సభకు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఆదేశాల మేరకే వారు వెళ్లలేదని ఆరోపించారు. రాజీనామాలపై చిలుకపలుకులు మట్లాడిన వారు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నారు. దీనిపై బుధవారం లోగా స్పష్టమైన సమాధానం చెప్పకపోతే ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందరి బండారం బయటపెడతానని హెచ్చరించారు.
తమ పార్టీకి చెందిన సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభలో తెలుగులో మాట్లాడితే అసహనం ఎందుకన్నారు. తెలుగు వాడిని కాబట్టి తెలుగులో మాట్లాడుతానని ఆయన చెప్పారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులు గవర్నర్ నరసింహన్‌ను కలవడమేమిటన్నారు. ముందు భర్తలతో రాజీనామా చేయించిన అనంతరం వారు గవర్నర్‌ను కలిసుండే బాగుండేదన్నారు.












Click it and Unblock the Notifications