రోడ్డు ప్రమాదంలో టిడిపి నేత లాల్ జాన్ బాషా మృతి

లాల్ జాన్ బాషా ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనం డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయాణమయ్యారు. 1984లో గుంటూరు నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా టిడిపి తరఫున ఎన్నికయ్యారు. 1991లో ఆయన ఎన్‌జి రంగాను ఎన్నికల్లో ఓడించారు. ముంబైలోని ప్రఖ్యాతి గాంచిన మార్కంటైల్ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన పనిచేస్తున్నారు.
బాషా మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు నల్లగొండకు బయలుదేరారు. లాల్ జాన్ బాషా మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటు అని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలను కోల్పోయిందని అన్నారు. గురువారం మధ్యాహ్నం తలపెట్టిన పత్రికా సంపాదకులతో సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. లాల్ జాన్ బాషా మృతికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.












Click it and Unblock the Notifications