అగ్గిపెట్టెలో శాలువా: సోనియాకు పొన్నం బహుమతి
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అరుదైన కానుక ఇచ్చాడు. అగ్గిపెట్టెలో పట్టే శాలువాను ఆయన సోనియా గాంధీకి బహుకరించారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోని సిరిసిల్ల చేనేతకు ప్రఖ్యాతి గాంచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికులు గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత చీరను కూడా నేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ తరహాలోనే ఇప్పుడు అగ్గిపెట్టెలో పట్టే శాలువాను తయారు చేయించి దాన్ని కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పొన్నం ప్రభాకర్ బహూకరించారు.

గతంలో తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని, కానీ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్ష చేపట్టడం ఇరు ప్రాంతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికేనని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కలిసి ఉండలేమని చెబుతుంటే విజయమ్మ దీక్ష ఎలా చేస్తారని ఆయన గురువారం హైదరాబాదులో అన్నారు.












Click it and Unblock the Notifications