విహెచ్ రెచ్చగొట్టారు, హరీష్ దాడి చేయలేదా: సోమిరెడ్డి

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో దళిత ఉద్యోగిపై హరీష్‌రావు దాడి చేయలేదా అని అడిగారు. తెరెస, బిజెపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. సమైక్య ఉద్యమం కుట్రపూరితమైనదని విహెచ్ రెచ్చగొట్టడం సబబుకాదని సోమిరెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యోగులను పంపించండి
సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోలు తలపెట్టిన ఉద్యమం ఓ బూటకమని తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. తిరుమలలో వీహెచ్‌పై చెప్పల దాడిని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. సీమాంధ్రులతో కలిసిఉండేది చెప్పు దెబ్బలు తినడానికా అని ప్రశ్నించారు.
సీమాం«ద్రులు తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. భీమా భవన్ వార్ జోన్ కాదని...పీస్ జోన్ అని ఆయన అన్నారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను హైదరాబాద్‌కు పంపాలని, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను వాళ్ల స్థానాలకు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు దేవీ ప్రసాద్ తెలిపారు.
అక్రమాస్తులను కాపాడుకోడానికే తెలంగాణ నేతలు, అధికారులపై దాడులు చేస్తున్నారని మరో నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణవాదులపై దాడులు చేయడం ఏం సంస్కృతి అని ప్రశ్నించారు. తెలంగాణపై వెనక్కి వెళితే తమ తడాఖా చూపిస్తామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
తిరుమలలో తమ పార్టీ సీనియర్‌నేత వి.హనుమంతరావుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, దీనికి కారకులెవరో ఆంటోని కమిటీకి చెప్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications