వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో కాంగ్రెసు చర్చలు, బిల్లు పెట్టే దాకా..: వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

MP G Vivek
కరీంనగర్: పార్టీ విలీనంపై కాంగ్రెసు నాయకత్వం తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో చర్చిస్తోందని, దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు తాను తెరాసలోనే ఉంటానని ఆయన చెప్పారు.

తెరాస శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం కెసిఆర్‌తో నాయకత్వంలో ఉద్యమించాలనే తాను తెరాసలో చేరానని, బిల్లు పెట్టేవరకు ఆ పార్టీలోనే ఉంటానని అన్నారు.

బిల్లు పెట్టిన తర్వాత తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరుతారా అని ప్రశ్నిస్తే - కెసిఆర్ పార్టీ అధిష్టానం చర్చిస్తోందని, దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని రెండేళ్ళుగా తాను చెబుతూ వస్తు న్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం ద్వారా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం సం దర్భంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు సీమాంధ్రలో విగ్రహాలను ధ్వంసం చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని, డిజిపిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Telangana Rastra Samithi (TRS) leader and MP G Vivek said that Congress is discussing with his party president K Chandrasekhar Rao on merger issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X