వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజిస్తే ఊరుకోం: ధర్మాన, పర్సులోనే రిజైన్ లేఖ: కిల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Prasada Rao and Killi Kruparani
శ్రీకాకుళం/హైదరాబాద్/చిత్తూరు: రాష్ట్రాన్ని విభజిస్తే తాము ఊరుకునేది లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని కోరారు. తాము సమైక్యాంధ్ర ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ప్రజల వాదనే కాంగ్రెసు పార్టీ వాదనగా ఉంటుందని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ప్రజలు కోరుకుంటే తాను రాజీనామా చేసేందుకు వెనుకాడేది లేదని చెప్పారు.

ఆంటోనీ కమిటికీ సమైక్యవాదానికి అనుకూలంగా వాదన వినిపిస్తామని, అవసరమైతే రాజీనామా చేస్తామన్నారు. తన రాజీనామా పత్రం తన పర్సులోనే ఉందని చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని తప్పు చేశారన్నారు.

ప్రజాభీష్టం మేరకు తాము ఉద్యమిస్తున్నామన్నారు. ప్రజలతో మమేకమై ఉద్యమంలో పాల్గొనాలని ధర్మాన, కృపారాణిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తామిచ్చిన లేఖలు వెనక్కి తీసుకోవాలని వారు సూచించారు. విభజనపై నిర్ణయం పార్టీదే గానీ ప్రభుత్వానిది కాదని చెప్పారు.

విహెచ్‌ను అరెస్టు చేయాలని ధర్నా

రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావును అరెస్టు చేయాలని సమైక్యవాదులు తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

భయం వద్దు: తోట

ఎస్మాలకు ఉద్యోగులు భయపడవద్దని, ఉద్యోగులకు తాము అండగా నిలబడతామని మంత్రి తోట నర్సింహం చెప్పారు.

రాహుల్‌ను ప్రధాని చేసేందుకే: దేవినేని

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలుగు జాతిని చీల్చారని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు గుంటూరులో మండిపడ్డారు. దూళిపాళ్ల నరేంద్ర దీక్షకు దేవినేని, శ్రీధర్‌లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంటోనీ కమిటీ దొంగల ముఠా కంపెనీ అన్నారు.

English summary
Congress Party senior leaders Dharmana Prasad Rao and Killi Kruparani were said that they are ready to resign for Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X