వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ దీక్షపై గాలి లాజిక్: టి కాంగ్, జగన్ కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలుగదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలని టిడిపి డిమాండ్ చేస్తోందని, అందుకే పార్లమెంటులో కూడా పోరాడుతున్నామని, మరి జగన్ పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని టిడిపి ఉద్యమిస్తోందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అదే అడుగుతోందని, అలాంటప్పుడు తమను విమర్శించడమేమిటన్నారు. సమైక్యాంధ్ర కోరుతున్న వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర సమితి పైన ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను విలీనం చేసుకోవాలని చూస్తోందని, సీమాంధ్రలో జగన్ పార్టీతో సీమాంధ్ర కాంగ్రెసు, తెలంగాణలో తెరాసతో తెలంగాణ కాంగ్రెసు ఏర్పాటు చేయాలని చూస్తోందన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ సబ్బం హరిల చర్చల సారాంశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలతో కాంగ్రెసు పార్టీ కుమ్మక్కైందన్నారు. హైదరాబాద్ రాజధాని కాబట్టే సీమాంధ్రులు వచ్చారని, ఈ నగరం తమదనుకున్నామని, ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్లిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. బైబిల్ చేతపట్టి తెలంగాణ అనుకూల ప్రకటన చేసిన విజయమ్మ, ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారన్నారు.

టిలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్

రాష్ట్ర విభజనతో కాంగ్రెసు పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని, తెలంగాణలో తెరాస, ఆంధ్రాలో జగన్ అండతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తోందని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారన్నారు.

English summary
Telugudesam Party senior leader Gali Muddukrishnama Naidu on Monday questioned that Why YSR Congress Party honorary president YS Vijayamma is doing deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X