వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులు, విభజన... టెన్షన్స్: ప్రణబ్‌కు సోనియా మొర!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, సరిహద్దుల్లో ఉద్రిక్తత, పార్లమెంటు సమావేశాల్లో నిరసనలు, బిల్లుల ఆమోదం.. తదితర సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినట్లుగా ప్రచారం సాగుతోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రాన్ని పలు సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో పరిష్కారం కోసం ప్రణబ్ దాదాను కలిశారట.

రెండు రోజుల క్రితం మధ్యాహ్న భోజన సమయంలో ఆయనతో సోనియా భేటీ అయి.. దాదాపు గంటన్నర పాటు అనేక అంశాలపై చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ, వారి సంభాషణ సారాంశం ఏమిటో తెలియదని చెబుతున్నారట. అయితే, నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక మూకలు ఐదుగురు జవాన్లను బలిగొనడం, దాంతోపాటు దాదాపు 15 రోజులుగా కాల్పులు కొనసాగించడం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చి ఉంటుందని అంటున్నారు.

ఇక "సహనానికీ హద్దులుంటాయ''ని స్వాతంత్య్ర దినం ముందు రోజున తన ప్రసంగంలో ప్రణబ్ పాకిస్తాన్‌ను గట్టిగానే హెచ్చరించారు. కానీ, మరునాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట ప్రసంగం చప్పగా చల్లారిపోవడం సోనియాను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారట. అంతకుముందు కూడా పాక్‌పై మెతకదనం పనికి రాదని, మరింత కఠినవైఖరి అవసరమని పార్టీ ఒత్తిడి తెచ్చింది.

ఫలితంగానే భారత్ వ్యతిరేక పాక్ జాతీయ చట్ట సభ తీర్మానాన్ని ఖండిస్తూ మన పార్లమెంటులో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే నెల ఆ దేశ ప్రధానితో మన్మోహన్ సింగ్ భేటీ పైనా కచ్చితమైన సమాచారం పంపలేదట. ఇవన్నీ అటుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై తన కలవరాన్ని సోనియా ఆయన వద్ద వెళ్లబోసుకున్నారట. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి పైన కూడా వారు చర్చించారట. కాగా, ట్రబుల్‌షూట్‌గా పేరొందిన ప్రణబ్ రాష్ట్రపతి కాకముందు సోనియా పలుమార్లు సమస్యలపై ఆయనతో ప్రత్యేకంగా చర్చించేవారు. ఆయన సలహాలు తీసుకునే వారు.

English summary
Concenred about the BJP led Opposition's attack against her party over the LoC killings, UPA chairpersons Sonia Gandhi on Friday afternoon met President Pranab Mukherjee seeking his tips on how to defuse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X