వెళ్లాలనుకుంటే వెళ్లు కానీ..: కొండా సురేఖకు అంబటి

కాంగ్రెసు నేతలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను సురేఖ చదివారని విమర్శించారు. రాఖీ పండుగ రోజున జగన్ పైన నిందలు వేయడం సరికాదన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీ నేత పైన ఆమె ఆరోపణలు చేసినప్పటికీ సంయమనంతో వ్యవహరించామని వారు అన్నారు. కాగా, ఈ రోజు ఎఎన్ఆర్ సెంటర్లోని వైయస్ విగ్రహానికి రాఖీ కట్టిన సురేఖ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
డిగ్గీకి మతిభ్రమించింది: మైసూరా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేఖ ఇచ్చిందన్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై జగన్ పార్టీ నేత మైసురా రెడ్డి మండిపడ్డారు. డిగ్గీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఆయన మాటలు అసత్యమని, ఒకవేళ తాము విభజన జరిగితే ఇరు ప్రాంతాల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, అలాగే అందరికీ సమన్యాయం చేయాలని గతంలో దిగ్విజయ్ సింగ్‌ను కలిసినప్పుడు కూడా సూచించామన్నారు. అదే విధంగా ఎపి విభజనపై ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పామన్నారు. అఖిల పక్షంలో తాము చెప్పిన విషయాలను పక్కన పెట్టారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications