లైంగిక దాడి ఆరోపణలపై ఆశారాం బాపుపై కేసు

జోద్‌పూర్‌లో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంఘటనకు ఈ కేసు సంబంధించింది. తాము ఫీర్యాదును నమోదు చేసుకున్నామని, సంఘటన రాజస్థాన్‌లో జరిగిందని అమ్మాయి చెబుతోందని, అందువల్ల కేసును రాజస్థాన్‌కు బదలాయిస్తామని పోలీసు అధికారి ఒకర ఓ వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు.
జాయింట్ పోలీసు కమిషనర్ తేజేంద్ర లూత్రా నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ జోషీ కేసును దర్యాప్తు చేస్తున్నారు. డిసిపి ఆలోక్ కుమార్ ఆశారాం బాపును ప్రశ్నించే అవకాశం ఉంది. అమ్మాయి తండ్రి ఉత్తరప్రదేశ్‌లో షాజహాన్‌పూర్‌లో ట్రాన్స్‌పోర్టర్. జోద్‌పూర్, షాహజాన్‌పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో అమ్మాయి ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేసింది.
ఓ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బ తినకుండా కేసు విషయంలో పోలీసులు అతి జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో భూకబ్జాలకు సంబంధించిన కేసులు కూడా ఆయనపై ఉన్నాయి.












Click it and Unblock the Notifications