ధరల మంట: ఉల్లిగడ్డల ట్రక్కును ఎత్తుకెళ్లిన దొంగలు

జైపూర్ రిటైల్ మార్కెట్లలో ఉల్లిగడ్డలు కిలో 65 నుంచి 75 రూపాయలు పలుకుతున్నాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. శికర్‌లో మండీలో 40 టన్నుల ఉల్లిగడ్డలను నింపుకుని ట్రక్ డ్రైవర్ మింటూ, క్లీనర్ రింకూ మీరట్ వెళ్తుండగా దోపిడీ దొంగలు అడ్డగించి వాహనాన్ని ఎత్తుకెల్లారు.
షాపూర్ గ్రామం వద్ద టాటా 907 వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ట్రక్కు తమ వాహనాన్ని ఢీకొట్టిందని డ్రైవర్, క్లీనర్‌లతో వాదులాటకు దిగారు. వాహనం దిగాలని పట్టుబట్టారు. వారు దిగగానే వారిని పక్కకు నెట్టేసి వాహనాన్ని తోలుకెళ్లారు.
దాంతో డ్రైవర్, క్లీనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు గంటల పాటు గాలింపు జరిపి వాహనాన్ని దొంగిలించినవారిని పోలీసులు పట్టుకున్నారు. కోట్‌పుత్లీ వద్ద పోలీసులు ఆ వాహనాన్ని అడ్డగించారు. అయితే, వర్షం, చీకటి ఆసరా చేసుకుని వారు పారిపోయారు.












Click it and Unblock the Notifications