చిరు ఫ్యాన్స్ రక్త దానం, తెలుగుతల్లికి బదులు టి తల్లి!

Chiranjeevi
హైదరాబాద్/శ్రీకాకుళం/కర్నూలు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభిమానులు శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేసి నిరసన తెలిపారు. సీమాంధ్రలోని జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు పెరుగుతోంది. అభిమానులు, సమైక్యవాదులు రాష్ట్ర విభజనను నిరసిస్తూ చిరంజీవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీకాకుళంలో మాత్రం అభిమానులు రక్తదానం చేశారు. తమ నిరసన ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని వారు అన్నారు.

అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న నిరసన తెలిపారు. అనంతపురంలో హైదరాబాదు వెళ్లేందుకు పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యాలయంలో పలువురు పాస్ పోర్టు తీసుకుని విభజనకు నిరసన తెలిపారు.

తెలుగు తల్లికి బదులు తెలంగాణ తల్లి

కర్నూలు జిల్లాలో సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఓ నిరసన కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలో తెలుగు తల్లికి బదులు తెలంగాణ తల్లిని పొందుపర్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బిజెపిపై వివేక్ మండిపాటు

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కయ్యాయని ఎంపి వివేక్ మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్‌ను బిజెపి ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి తెలంగాణవారిని రెచ్చగొట్టేలా ఉందన్నారు. కిరణ్ ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించారో చెప్పాలని మరో ఎంపి మంద జగన్నాథం ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కోసం ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతొ ఒప్పందం కుదుర్చుకుందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ వేరుగా మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటును స్తంభింప చేయాలని డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరులో దీక్ష చేస్తున్న రామకృష్ణకు మద్దతు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+