సోనియా వద్దకు సీమాంధ్ర మధ్యవర్తిగానే ఆసదుద్దీన్

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతల విజ్జప్తి మేరకే అసదుద్దీన్ ఒవైసీ సోనియాను కలిసి తాజా ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. సోనియా ముందు గట్టిగా వాదనలు వినిపించలేకనే ఒవైసీ ద్వారా తమ అభిప్రాయాలను చేరవేసినట్లు సమాచారం. రాయలసీమ జిల్లాలు సైతం వెనుకబడి ఉన్నందున గ్రేటర్ తెలంగాణ ఏర్పాటు చేస్తే ఈ రెండు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని ఒవైసీ వివరించినట్లు తెలిసింది. రెండు ప్రాంతాలను కలిపి ఉంచితే జలాల పంపిణీలో కూడా సమస్యలు తలెత్తవని చెప్పినట్లు తెలిసింది.
రాయల తెలంగాణ ఏర్పాటు చేసిన పక్షంలో కాంగ్రెస్‌కే కాకుండా తమకు ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని ఓటర్ల గణాంక వివరాలను ఒవైసీ వివరించినట్టు తెలిసింది. ఆయన చెప్పినవన్నీ ఓపికగా విన్న తర్వాత ఆ వివరాలను అంటోనీ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాని సోనియా సూచించినట్టు సమాచారం.
అయితే, ప్రత్యేక తెలంగాణలో మజ్లిస్ బలహీనపడటం ఖాయమని, అందుకే రాయలసీమ జిల్లాలతో కలిపి తెలంగాణ ఇవ్వాలని ఆయన కోరుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications