విభజనపై అధికారిక కమిటీ: బొత్స, కెసిఆర్‌పై తోట ఫైర్

విభజనపై ఇప్పటి వరకూ పార్టీ పరంగానే నిర్ణయం జరిగిందని, దీనికి యూపిఏ భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇచ్చాయని వివరించారు. కేంద్రం చేపట్టాల్సిన ప్రక్రియ ఇంకా మిగిలే ఉందన్నారు. విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించి, ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఉంటుందన్నారు. అభ్యంతరాలపై తగిన సలహాలు, సూచనలు, ఇస్తే వాటిని అధికారిక కమిటీ పరిశీలించి బిల్లు రూపంలో తయారు చేస్తుందని చెప్పారు.
ఇదంతా రాష్ట్ర విభజన తప్పనిసరి అని భావిస్తేనే జరుగుతుందని బొత్స స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారిక కమిటీ అవసరం లేదని కేంద్రం భావిస్తోందన్నారు. రాష్ట్ర విభజన అంశం అసెంబ్లీలో రెండుసార్లు చర్చకు వస్తుందన్నారు. అసెంబ్లీలో ఇరు ప్రాంతాల వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇప్పటికిప్పుడు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అడ్డుకోవద్దని కోరారు.
హైదరాబాద్ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాబు సొత్తా అంటూ మంత్రి తోట నరసింహం కాకినాడలో అన్నారు. తెలంగాణ ది ఆర్గనైజెడ్ ఉద్యమమని, సీమాంధ్రులది ప్రజా ఉద్యమమని అన్నారు. సమైక్యవాదనను గట్టిగా వినిపించిన దమ్మున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉద్యమ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తేవడం వలనే విభజన ప్రక్రియ ముందుకు కదలకుండా ఉందన్నారు. కేంద్ర మంత్రులను రాజీనామా చేయాలని అనడంలో అర్ధం లేదని, వారి కృషి వల్లే ఆంటోనీ కమిటీ వేశారని అన్నారు.












Click it and Unblock the Notifications