హరికృష్ణ యాత్ర: వైయస్ జగన్‌కు లాభమా, నష్టమా?

YS Jagan and Harikrishna
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేసి సీమాంధ్రపై మాత్రమే దృష్టి పెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామా చేసి సీమాంధ్రలో పర్యటన చేయడం లాభిస్తుందా, నష్టపరుస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. హరికృష్ణ సమైక్య నినాదంతో సీమాంధ్రలో చైతన్య రథ యాత్ర చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో బలం పెరుగుతుందా, జగన్‌కు నష్టం జరుగుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

హరికృష్ణ పర్యటన వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోతుందని, సీమాంధ్రలో ప్రజలు టిడిపికి వ్యతిరేకమవుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంచనా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వల్లనే రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చిందనే తమ వాదనకు హరికృష్ణ వాదన మరింత బలం చేకూరుస్తుందని, దాంతో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, హరికృష్ణ విషయంలో చంద్రబాబు అనుకున్నదే జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తూ హరికృష్ణ మాట్లాడిన తర్వాత చెప్పాపెట్టకుండా ఇతర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఆ విషయం హరికృష్ణకు నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్పారని అంటున్నారు. దీంతో హరికృష్ణ ఆగ్రహానికి గురై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా సమైక్య నినాదాన్ని అందుకుని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు.

చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హరికృష్ణ దీన్ని అవకాశంగా తీసుకుని సీమాంధ్రలో తన బలాన్ని సమీకరించుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన పార్టీ కూడా పెట్టవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీ పెడితే జగన్ గారె నేతిలో పడినట్లేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓట్లు సీమాంధ్రలో చీలి తమకు లాభం చేకూరుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంచనాకు వస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే, తెలుగుదేశం పార్టీ అంచనాలు మరో విధంగా ఉన్నాయి. హరికృష్ణ సమైక్య నినాదంతో ప్రజల్లోకి వెళ్తే సమైక్యాంధ్రను కోరుకుంటున్న ఓట్లను చీలుస్తారని, దానివల్ల జగన్ నష్టపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, హరికృష్ణ రెండు పార్టీల ఓట్లనూ చీల్చవచ్చుననే అంచనా కూడా సాగుతోంది. ఏమైనా, హరికృష్ణ పార్టీ పెడుతారా, చంద్రబాబుపై సమరం ప్రకటిస్తారా అనేది ఇంకా తేలాల్సే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+