రెచ్చగొడ్తున్నారు, టి రాకుండా వాదన: కెసిఆర్‌పై జగ్గారెడ్డి

తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెరాస తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తోందన్నారు. తెలంగాణవాదం లేకుంటే కెసిఆర్‌కు రాజకీయ ప్రాధాన్యత ఉండదని, అందుకే రాష్ట్ర విడిపోవద్దు... తెలంగాణవాదం అలాగే ఉండాలనేది తెరాస అభిప్రాయమన్నారు. తెలంగాణ వచ్చాక దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చెబుతుండగా.. మరోవైపు ఆయన ఛానల్లో ఆయనను సిఎంగా కోరుకుంటున్న వారి శాతం చాలా ఉందని ఇస్తుండటం దేనికి సంకేతమన్నారు.
తెరాస రానురాను రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. అందుకే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తోందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు భరోసా కల్పిస్తామన్న వారు ఉద్యమాన్ని వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా ప్రజల మధ్య విభేదాలు రావొద్దన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని, దానిని అమలు చేయాల్సిన తరుణంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు.
అందరికీ నష్టమే: దానం
విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులో అన్నారు. తమకు ఆంటోని కమిటీ నుండి పిలుపు వస్తుందని భావిస్తున్నామని, పిలుపు వస్తే హైదరాబాద్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అక్కడ చెబుతామని, అందుకు అనుగుణంగానే నడుస్తామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అందరికీ నష్టమే అన్నారు.
వైయస్సే అపాయింటుమెంట్ ఇప్పించారు: శంకర రావు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే తెలంగాణ కోసం నాడు తెలంగాణ నేతలు ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ ఇప్పించారని మాజీ మంత్రి శంకర రావు చెప్పారు. బిజెపి హయాంలోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదన్నారు.












Click it and Unblock the Notifications