మేం కలిస్తే కలుషితమనే.., రెచ్చగొట్టడంలేదు: లగడపాటి

నాయకులతో సంబంధం లేకుండా ఉద్యమం నడుస్తోందని, ప్రజలే ఉద్యమిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మాత్రం అన్ని పార్టీలు కలిసి ఉద్యమించాయన్నారు. సీమాంధ్రలో ఉద్యమకారులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఉద్యమకారులలో ఉన్న స్పష్టత నాయకులలో లేదని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమానిని తాము రెచ్చగొట్టడం లేదని చెప్పారు. వారు చేస్తున్న ఆందోళననే తాము సభలో చెబుతున్నామన్నారు.
విభజన ప్రక్రియ ముందుకు సాగకుంటే ప్రజలు శాంతిస్తారని చెప్పారు. ఉద్యమాన్ని కలుషితం చేయలేకే తాము రాజీనామా చేయడం లేదన్నారు. సమైక్యాంధ్రను తప్పకుండా సాధిస్తామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కేవలం కాంగ్రెసు పార్టీ నేతలో ఉద్యమిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్ సమైక్యమే తప్ప మరొకటి లేదని ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డిలు అన్నారు. ఏ కమిటీ వేసినా తమది సమైక్య గళమే అన్నారు. సీమాంధ్ర ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు.
రాజ్యసభలో ఆందోళన: టిడిపి ఎంపీలు
లోకసభలో ఎంపీల సస్పెన్షన్ వేటుపై తాము రాజ్యసభలోను ఆందోళన చేస్తామని టిడిపి ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు వేరుగా చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై పోరాడితే సస్పెన్షన్ చేయడం దురదృష్టకరమన్నారు.
డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం
విభజన విషయంలో పార్టీలు ద్వంద్వ వైఖరులు అవలంభిస్తున్నాయంటూ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తుండటంతో సభను మరోసారి అరగంట పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications