ఆవేదనతో హరి: రేవంత్, మార్షల్స్‌తో నెట్టేశారు: ఎంపీలు

సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికి ప్రయత్నాలు చేసి, తెలంగాణపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కెసిఆర్‌కు లేదా అని ఆయన అడిగారు. రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెసు రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుందని విమర్సించారు. కెసిఆర్ రెచ్చగొట్టే ప్రకటనల వల్లనే సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడిందని ఆయన ఆరోపించారు. కెసిఆర్ పిల్లలను బొంద పెట్టి తన పిల్లలను అందలమెక్కించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తమను మార్షల్స్‌తో బయటకు నెట్టేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు వ్యాఖ్యానించారు. పార్లమెంటు నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత వారు సభలోనే కూర్చున్నారు. సభ వాయిదా పడినప్పటికీ వారు అలాగే కూర్చోవడంతో మార్షల్స్‌తో వారిని బయటకు పంపించి వేశారు. పార్లమెంటును వేదికగా చేసుకుని పోరాడే ఆవకాశాన్ని తమకు లేకుండా చేశారని వారన్నారు. తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి లోపభూయిష్టమైన విభజన ప్రక్రియను ఆపే వరకు పోరాటాలు చేస్తామని వారు చెప్పారు.
రాజ్యసభలో కూడా లోకసభలో మాదిరిగానే జరిగిందని సుజనా చౌదరి అన్నారు. ప్రజల గొంతును వినిపించడానికి తమకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. సమస్యను కాంగ్రెసు పార్టీయే సృష్టించిందని, కాంగ్రెసు పార్టీ పరిష్కరించాలని ఆయన అననారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, మంత్రులు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆయన అన్నారు.
తమ ఆందోళను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిమ్మల కిష్టప్ప అన్నారు. తమ ప్రజలను పట్టించుకోవాలని అడిగితే తమను లోకసభ నుంచి సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. ఇంకా 12 మంది సభ్యులు సభలో ఉన్నారని, తమ బాధ్యతను వారు తీసుకుంటారని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications