ఉద్యమంతో ఫలితం లేకుంటే రాజీనామాకి సిద్ధం: కావూరి

రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతుందని తాము ముందుగానే అధిష్టానానికి చెప్పామన్నారు. సీమాంధ్రలో పరిస్థితిని ప్రధానమంత్రి మన్నోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, అంటోనీ కమిటీకి తాము ముందే వివరించామన్నారు. ఇంత ఉద్యమించినా సానుకూల ప్రకటన రాకుంటే సీమాంధ్ర నేతలమంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
శ్రీవారి అభిషేక సేవలో బాలయ్య, కొత్త దంపతులు
తిరుమల శ్రీవారిని హీరో, టిడిపి నేత బాలకృష్ణ, కొత్త దంపతులు శ్రీభరత్, తేజస్వినిలు కలిసి దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి అభిషేక సేవలో నూతన దంపతులతో కలిసి పాల్గొన్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. బాలయ్యను చూసేందుకు ఆలయం వద్ద అభిమానులు భారీగా తరలి వచ్చారు.
శ్రీవారిని దర్శించుకున్న విజయ్ కాంత్
ప్రముఖ తమిళ సినీ హీరో విజయకాంత్ శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
కాసేపట్లో అఖిల పక్షం
విభజన నిర్ణయం నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు సమావేశాలకు అడ్డుపడుతున్న నేపథ్యంలో లోకసభ స్పీకర్ అధ్యక్షతన కాసేపట్లో అఖిల పక్షం భేటీ జరగనుంది. ఈ భేటీకి స్పీకర్ మీరా కుమార్ అన్ని పార్టీలను ఆహ్వానించారు. మరోవైపు టిడిపి ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఆ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications