విశాఖ హెచ్‌పిసిఎల్‌లో భారీ పేలుడు: నలుగురు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో భారీ ప్రమాదం సంభవించింది. భారీ పేలుడు సంభవించి దాదాపు పది మంది మరణించినట్లు తొలుత ప్రచారం జరిగింది. మరో 50 మంది దాకా గాయపడినట్లు భావించారు. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ శుక్రవారం సాయంత్రం పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారని, 33 మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
పేలుడు కారణంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో మంటలను ఎగిసిపడుతున్నాయి. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

నాప్తాలీన్ పైప్‌లైన్ పేలి 1997లో 63 మంది మరణించారు. ప్రస్తుత ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మృతదేహాలను కెజిహెచ్‌కు తరలిస్తున్నారు. గాయపడినవారిలో 30 మందిని ఐఎన్ఎస్ కళ్యాణి ఆస్పత్రికి, మరో 20 మందిని కెజిహెచ్‌కు తరలించినట్లు చెబుతున్నారు. అయితే, 33 మంది మాత్రమే గాయపడ్డారని అధికారులు అంటున్నారు.
విశాఖపట్నంలోని హెచ్‌పిసిఎల్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణ వైద్యం అందించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications