సభలో అదే సీన్: చిరు బిల్లు ప్రతిపాదన, విభజనపై చర్చ

LS adjourned as AP MPs protest against division
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం కూడా సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే తమ ప్రాంతానికి న్యాయం చేయాలని, సేవ్ ఎపి అంటూ టిడిపి సభ్యులు, సమైక్యాంధ్రకు అనుకూలంగా కాంగ్రెసు ఎంపీలు నినాదాలు చేశారు.

దీంతో ప్రారంభమైన ఐదు నిమిషాలకే లోకసభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు. పన్నెండు గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు ఆపలేదు. సభ జరిగేందుకు సహకరించాలని స్పీకర్ మీరా కుమార్ కోరారు. అయినా వారు తగ్గకుండా సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సభను మరోసారి అరగంట పాటు వాయిదా వేశారు. కాగా, ఎంపీలు ఓ వైపు నిరసన వ్యక్తం చేస్తుండగానే సీమాంధ్ర కేంద్రమంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, జెడి శీలం, కిషోర్ చంద్రదేవ్‌లు పలు బిల్లులు ప్రతిపాదించడం గమనార్హం.

పార్లమెంటులో చర్చకు నిర్ణయం

విభజన నిర్ణయం తీరు, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన వివిధ పార్టీ నేతలు సభ వాయిదా పడిన అనంతరం సమావేశమయ్యారు. సభ ప్రారంభానికి ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం జరిగినా లోకసభలో పరిస్థితి మారలేదు. దీంతో సభ వాయిదా పడిన అనంతరం మరోసారి స్పీకర్ సమావేశమయ్యారు. పార్లమెంటులో విభజనపై చర్చకు కేంద్రం అనుమతించింది. సభలో పార్టీల ప్రశ్నలకు ప్రభుత్వం సమాచారం చెప్పనుంది.

ప్రధానితో కమల్ నాథ్ భేటీ

పార్లమెంటులో విభజనపై చర్చకు అనుమతించిన అనంతరం కేంద్రమంత్రి కమల్ నాథ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. విపక్షాల అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+