సోనియా వెనక్కి తగ్గరు, సమైక్యం ఇష్టం లేదు: టీపై జెసి

తాను అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఆరుసార్లు పోటీ చేసి గెలిచానని, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే డిపాజిట్ కూడా దక్కదని దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే రెండు ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు తప్పవని అన్నారు. ట్రిబ్యునల్ తీర్పులను కూడా రాష్ట్రాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు.
రాజయకీయ నాయకులను నమ్మవద్దని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ సూచించారు. శనివారం ఉదయం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తమకు హైదరాబాద్ ముఖ్యం కాదని, రైతుల సంక్షేమమే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి లాగింది రాజకీయ పక్షాలే అని ఆయన ఆరోపించారు. నిర్ణయం మార్చుకోవాలని కాంగ్రెసు అధిష్టానంతో పోరాడుతున్నామని బుద్ధ ప్రసాద్ తెలిపారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్‌ను విస్మరించే నైతికత కాంగ్రెసు పార్టీకి ఎక్కడిదని ఆయన శనివారం హైదరాబాదులో ప్రశ్నించారు. బిజెపి మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఆయన అనన్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అసలు లేదని, ఇక ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఎలా వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications