విభజనకు నిరసన: జైలులో వైయస్ జగన్ నిరాహార దీక్ష

వైయస్ జగన్ దీక్ష చేస్తానని చెప్పారని, అయితే తాము వద్దన్నామని, దీక్ష చేస్తే జగన్‌ను వేరే రాష్ట్రంలోని జైలుకు పంపించే ప్రమాదం ఉందని వద్దన్నామని విజయమ్మ తన దీక్షను ప్రారంభించిన రోజు చెప్పిన విషయం తెలిసిందే. విజయమ్మ దీక్ష భగ్నం నేపథ్యంలో తాను దీక్ష చేయాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి జగన్ దీక్ష చేస్తారని ఆయన భార్య భారతి చెప్పారు. జగన్‌ను శనివారం భారతితో పాటు పార్టీ ముఖ్య నేతలు కలిశారు. వారితో జగన్ తాను దీక్ష చేపట్టబోయే విషయంపై చర్చించారు.
అన్ని ప్రాంతాలవారికి సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథ స్థితిలో ఉంచాలని వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అదే వైఖరితో సీమాంధ్రలో తన ఉద్యమాన్ని సాగిస్తోంది. కాగా, గుంటూరు ఆస్పత్రిలో వైయస్ విజయమ్మ జగన్ విజ్ఝప్తితో విరమించారు.
అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ అరెస్టయి హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి పూనుకుందని వైయస్ జగన్ విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications