అవనిగడ్డలో టిడిపి అభ్యర్థి అంబటి ప్రసాద్ విజయం
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ ఘన విజయం సాధించారు. శనివారంనాడు ఓట్ల లెక్కింపు జరిగింది. అంబటి శ్రీహరి ప్రసాద్ 61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు రాగా, సుబ్రహ్మణ్యానికి 3,389 ఓట్లు వచ్చాయి.
అంబటి శ్రీహరి ప్రసాద్‌పై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. అంబటి శ్రీహరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీలను కోరింది. దీంతో ఆ పార్టీలు అభ్యర్థులను పెట్టలేదు. అయితే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండడంతో పోలింగ్ అనివార్యంగా మారింది.

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో అవనిగడ్డకు ఉప ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్‌ను పోటీకి దింపింది. దీంతో మిగతా పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి.
అంబటి శ్రీహరి ప్రసాద్ విజయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై విశ్వాసంతో శ్రీహరి ప్రసాద్‌ను గెలిపించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications