అమ్మాయితో మాట్లాడిన దళిత బాలుడిపై కత్తులతో దాడి

జాతీయ మీడియా కథనాల ప్రకారం - ఈ సంఘటన ఆగస్టు 21వ తేదీన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలోని ఇంటిన్సెవ్ కేర్ యూనిట్లో చేర్చారు. అతని గాయాలకు శస్త్రచికిత్స చేశారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న దళిత బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత దళిత బాలుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు.
బాలిక తండ్రి కోసం గాలిస్తున్నామని, బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, బాలుడు బాలికను వేధించాడనే ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.
బాలిక తండ్రి ఎం మణి (45)ని పట్టుకోవడానికి ఎస్పీ బాలకృష్ణన్ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎన్ గోపాలకృష్ణన్ అనే దళితబాలుడు గ్రామం శివారులో ఆగస్టు 21వ తేదీ రాత్రి బంధువులు మనిమారన్, భారతిలతో మాట్లాడుతుండగా, బాలిక తండ్రి, దళితేతరులు దాడి చేశారు.












Click it and Unblock the Notifications