విభజనపై ప్రభుత్వ కమిటీ వేస్తాం: సోనియా గాంధీ

Sonia Gandhi
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరఫన ఓ కమిటీ వేస్తామని యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల సమస్యలను వినేందుకు ఆ కమిటీ వేస్తామని ఆమె చెప్పారు. తెలంగాణపై ప్రకటన వెలువరించిన తర్వాత ప్రభావిత ప్రాంతాల సమస్యలను వినేందుకు ఆంటోనీ కమిటీని వేశామని ఆమె గుర్తు చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ విధివిధానాల గురించి ఆమె వివరించలేదు. అయితే, అది రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను విని, వాటిని పరిశీలించేందుకు మాత్రమే పనిచేస్తుందని అర్థమవుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవడానికి కాదని అంటున్నారు. విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లడానికి అనుగుణంగా ఆ కమిటీ పనిచేయవచ్చునని తెలుస్తోంది.

జాతీయ సమాచార కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రభుత్వ కమిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పక్కనే ఉన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను వినడానికి మాత్రమే ఆంటోనీ కమిటీని వేశామని, ఇప్పుడు ప్రభుత్వం ఓ కమిటీని వేస్తుందని ఆమె చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఆమె చెప్పారు. ఈ విషయంలో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం చేయబోమని ఆమె చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+