ముంబై గ్యాంగ్ రేప్ కేసు: రెండో నిందితుడి అరెస్టు
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టు సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు రెండో నిందితుడిని అరెస్టు చేశారు. మధ్య ముంబైలోని మదన్‌పూర్‌లో విజయ్ జాదవ్ అనే రెండో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసారు. శుక్రవారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరో ముగ్గురిని పోలీసులు ఇంకా పట్టుకోవాల్సి ఉంది. నేరం జరిగిన 24 గంటల లోపల ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని గుర్తించారు. మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యచారం జరిగిన కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతుందని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు.

నిందితులను పట్టుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ 20 పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు సింగ్ చెప్పారు. అసైన్‌మెంట్‌పై శక్తి మిల్స్ ఆవరణకు వెళ్లిన 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్టుపై గురువారం సాయంత్రం ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు.
ఫొటో జర్నలిస్టు మగ సహోద్యోగిని ఆ ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ప్రస్తుతం జస్లోక్ అస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. తనపై అత్యాచారం జరిపిన నిందితులకు జీవిత ఖైదు పడాలని ఆమె కోరుకుంటోంది.












Click it and Unblock the Notifications