టీ, టిఫిన్ ముట్టని జగన్!: జైలు వద్ద భారీ బందోబస్తు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం నుండి టీ, ఫలహారం ఏదీ ముట్టనట్లుగా సమాచారం. ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

సమన్యాయం చేసి విభజన చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో జగన్ జైలులోనే దీక్షకు పూనుకున్నారు.

అయితే జగన్ దీక్షపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. జగన్ జైలులో దీక్ష చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఇప్పటి వరకు దీక్షకు అధికారులను కోరలేదని సమాచారం. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం జగన్ దీక్ష చేస్తారని చెబుతున్నారు.

జగన్ దీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆయన ఈ రోజు ఉదయం నుండి టీ గానీ, ఫలహారం కాని తీసుకోలేదని తెలుస్తోంది. జగన్ దీక్ష నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+