వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులు చేస్తాం: సీమాంధ్రసభపై ఓయు జెఏసి హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

OU JAC warns government on APNGOs meeting
హైదరాబాద్: ఎపిఎన్జీవోల సభకు ప్రభుత్వం అనుమతిస్తే తాము దాడులు చేస్తామని ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి ఆదివారం హెచ్చరించింది. ఎపిఎన్జీవోల సభకు ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో అనుమతిస్తే, నిజాం కళాశాల మైదానంలో తమకు కూడా అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. అదే జరిగితే ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వవద్దన్నారు.

తెలంగాణ విద్యార్థులు తలుచుకుంటే సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులు ఉండరని హెచ్చరించారు. రాష్ట్రం వచ్చాక తెలంగాణను దొరల తెలంగాణగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమాన్ని కొందరు నేతలు, జెఏసి తక్కువ చూపే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నవంబరులోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రపతి నుంచి అనుమతి ఉత్తర్వులు రాకుంటే విద్యార్థి ఐకాస రాజకీయ పార్టీగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు.

బాబుతో తీర్మానం చేయించగలరా: శైలజానాథ్

సమైక్యాంధ్రకు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల మద్దతు సంపూర్ణంగా ఉందని, అలా అని తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో తీర్మానం చేయించి తీసుకు రాగలరా అని మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలమంతా సమైక్యాంధ్రకే మద్దతిస్తున్నామన్నారు. ప్రభుత్వం కమిటీని ఆహ్వానిస్తున్నామని అయితే, విధివిధానాలు తెలిశాక స్పందిస్తామన్నారు. హైదరాబాదులో సీమాంద్ర సభను నిర్వహిస్తామన్నారు.

హరీష్ వ్యాఖ్యలపై గాదె

తెలంగాణ రాష్ట్ర సమితి అహంకారానికి ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలే నిదర్శనమని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. తెరాస నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

English summary
Osmania University JAC on Sunday warned Government on APNGOs meeting on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X