మరిది శవం పక్కనుండగా పోలీసుపై దొంగల గ్యాంగ్ రేప్

ఆమె ఫిర్యాదు ప్రకారం తన మరిది మృతదేహానికి గఢ్వాలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇద్దరు చెల్లెళ్లతో కలసి రాంచీ నుంచి కారులో బయల్దేరారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జగల్దాగా వద్ద జాతీయ రహదారిపై పలు వాహనాలను దోచుకున్న కొందరు దొంగలు వీరి కారునూ అడ్డగించారు. అనంతరం ఆమెను పక్కకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
కారులో మరిది మృతదేహం ఉందని చెప్పినా దుండగులు వినిపించుకోలేదు. కారులో ఆమెతో పాటు సోదరీలు ఉండగా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పోలీసు అయిన తన భర్త మావోయిస్టుల దాడిలో మరణించడంతో తనకు ఆ ఉద్యోగం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శనివారం విలేకరులకు తెలిపారు.












Click it and Unblock the Notifications