ముందు బిల్లు పెట్టండి!: సుష్మ డిమాండ్, జెసి ఆందోళన

Sushma Swaraj
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ నేత, లోకసభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఢిల్లీలో డిమాండ్ చేశారు. సుష్మా శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అసంపూర్ణంగా వ్యవహరించిందని, కొత్త రాష్ట్ర ఏర్పాటు పట్ల ప్రభుత్వం సీరియస్‌గా లేదని విమర్శించారు.

ప్రభుత్వం తక్షణమే బిల్లు పెట్టి, పాస్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఆటలాడుతున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణకు బిజెపి ఎల్లప్పుడూ మద్దతిస్తుందని పునరుద్ఘాటించిన సుష్మా, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఏ బిల్లునైనా పార్లమెంటులో తాము బలపరుస్తామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలను సెప్టెంబర్ 5 వరకూ పొడిగించాలని ప్రభుత్వం చూస్తోందని, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

డిపాజిట్లు దక్కవేమో: జెసి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితుల్లో ఉందని మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో అన్నారు. 'సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చేంత వరకూ నాకు పోటీలేరనే అభిప్రాయం ఉండేది, కానీ ప్రస్తుత ఉద్యమ పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవేమోనని అనిపిస్తోంది' అన్నారు. అయితే కాంగ్రెస్‌ని వీడే ప్రసక్తి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ చేసేదాని కన్నా రాజకీయాలు మానుకోవడం మంచిదన్నారు.

ఇటీవలే తాను ఆంటోనీ కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామన్నారు. అందుకు అధిష్ఠానం సుముఖంగా లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోయినా పర్వాలేదు.. విభజన తప్పదనే భావనలో అధిష్ఠానం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టనష్టాలను చూసిన వాడిగా రాయల తెలంగాణ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించానని, అయితే ఆంటోనీ కమిటీ ఎదుట సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు తెలిపామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+