జగన్ హెల్త్ బులెటిన్ రిలీజ్, కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే గుడ్‌బై

జైలు అధికారులు జగన్‌కు సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు జైలు అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బులెటిన్ విడుదల చేశారు. జైలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. బిపి, షుగర్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.
కాగా, జగన్ దీక్ష జైలులో రెండో రోజు కొనసాగుతోంది. ఆయన ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి తన దీక్షను ప్రారంభించారు. దీక్షను విరమించుకోవాలని జైలు అధికారులు సూచించగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ధర్మవరం ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా ధర్మవరం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆయన ఆ పార్టీని వీడుతున్నారు.












Click it and Unblock the Notifications