వేధింపులు: జీవిత భాగస్వామిని చంపిన మహిళ

Woman kills live in partner
హైదరాబాద్: వేధింపులు భరించలేక ఓ మహిళ తన జీవిత భాగస్వామిని హత్య చేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్లలో జరిగింది. కులకచర్లకు చెందిన జెట్టిగళ్ల పెద్ద నర్సింహులు(60)భార్య ముప్పై ఏళ్ల క్రితం మృతి చెందింది. దాంతో నర్సింహలు అదే గ్రామానికి చెందిన వితంతువు ఎల్లమ్మతో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

అయితే నర్సింహులు మద్యం మత్తులో ఎల్లమ్మను వేధిస్తూ ఉండేవాడు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదివారం ఉదయం ఇంట్లో నర్సింహులు తలపై బలమైన గాయాలతో హత్యకు గురై రక్తం మడుగులో కనిపించాడు. ఎల్లమ్మ ఇతరులను తీసుకొచ్చి తాను పక్కవారి ఇంట్లో పడుకున్నానని, ఉదయం ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నర్సింహులు చనిపోయి ఉన్నాడని చెప్పింది.

పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ నాగేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి తాను పక్క ఇంట్లో నిద్రించానని, ఉదయం చూస్తే నర్సింహులు హత్యకు గురై పడి ఉన్నాడని ఎల్లమ్మ తెలపడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే జాగిలాన్ని రప్పించగా జాగిలం ఎల్లమ్మ దగ్గరికి వెళ్లి పట్టుకుంది.

దీంతో పోలీస్‌లు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంఘటన స్థలాన్ని చేవెళ్ల డీఎస్పీ శిల్పవళ్లి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎల్లమ్మ హతమార్చి పక్క ఇంట్లోకి వెళ్లి నిద్రించిందని విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+