వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరేసుకునేదాన్ని: నన్నపనేని, సీమాంధ్రులకు పువ్వులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: పార్లమెంటులో తాను ఉండి ఉంటే అక్కడే ఉరేసుకుని దాన్నని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి సోమవారం హైదరాబాదులో అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన ద్వారా సీమాంధ్ర ప్రజలకు నీళ్లు రాకుండా చేసి వాళ్ల నోటి దగ్గర కూడు లాగేస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆహార భద్రత అనే హక్కులేదని ఆమె మండిపడ్డారు. తాను సభలో ఉంటే బిల్లును చించేసేదాన్నని, సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలకు చీము, నెత్తురు లేదన్నారు.

అశోక్ ఖబర్దార్!: జూపల్లి హెచ్చరిక

అశోక్ బాబూ.. రెచ్చగొట్టేలా మాట్లాడితే ఖబడ్దార్! అని ఎపిఎన్జీవో అధ్యక్షుడిని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు వేరుగా హెచ్చరించారు. సుదీర్ఘ కాలం ఇక్కడే ఉండాలనుకుంటే సరిగా మాట్లాడాలని, లేకపోతే తెలంగాణ సమాజం ఒప్పుకోదని తేల్చిచెప్పారు. తెలంగాణవాళ్లు 3.5 కోట్లమంది ఉంటే, సీమాంధ్రులు ఐదుకోట్ల మంది అనడంలో అర్థమేమిటని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఉండేవాళ్లు రెచ్చగొడితే ఎవరికి నష్టం? నగరం పై ముమ్మాటికీ తెలంగాణదే హక్కు అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా హైదరాబాద్‌ను సాధించలేరన్నారు. హైదరాబాద్ తమదని, ఇక్కడ శాంతిర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సమైక్యాంధ్ర జెఏసి నేతల్లా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేశ్ రెడ్డిలను తెలంగాణ మంత్రులు నిలదీయాలని కోరారు.

సీమాంధ్రులకు పువ్వులు

అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయులుగా కలిసుందామని కోరుతూ హైదరాబాదు నుండి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్సుప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సీమాంధ్ర వారికి వరంగల్ జిల్లా జనమగామలో స్థానికులు పువ్వులు ఇచ్చి పలకరించారు. తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సద్భావన యాత్రలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

English summary

 Telugudesam Party MLA Nannapaneni Rajakumari on Monday blamed Congess Seemandhra central ministers and MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X