సోనియా ఎదుట మోకరిల్లిన చిరంజీవి, కెసిఆర్!(పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు వినూత్నరీతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మాస్కులు ధరించి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతి దిగ్బంధంపై జిల్లా కలెక్టర్, పోలీసులు అధికారులు సమైక్యవాదులతో మంగళవారం చర్చించారు. రేపటి నుండి తిరుపతి దిగ్బంధం కార్యక్రమంలో స్వల్ప సడలింపులకు సమైక్యవాదులు అంగీకరించారు. తిరుమలకు వెళ్లే వాహనాలకు బైపాస్ మార్గం ద్వారా మళ్లింపుకు అనుమతి, రైల్వే స్టేషన్ నుంచి టిటిడి ఉచిత బస్సుల ద్వారా భక్తుల తరలింపుకు, కృష్ణాష్టమి సందర్భంగా ద్విచక్ర వాహనాలకు అనుమతికి సమ్మతి తెలిపారు.

రాజీనామా చేయకుండా తమ నిరసనలకు, ర్యాలీలకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు మంత్రి శైలజానాథ్‌ను అనంతపురంలో పలువురు ఉద్యోగులు తమ ర్యాలీలో అడ్డుకున్నారు. రాజీనామా చేశాక మాట్లాడాలని డిమాండ్ చేశారు.

జాతీయ జెండా

జాతీయ జెండా

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా పొడవైన జాతీయ పతకంతో సమైక్యవాదులు భారీ ర్యాలీని తీశారు. వారు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు.

తెరాసకు సూటుకేసు!

తెరాసకు సూటుకేసు!

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలంగాణ రాష్ట్ర సమితి నేతకు సూటుకేసు ఇస్తున్నట్లుగా నిరసన దృశ్యం. ఈ నిరసనలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశం

రౌండ్ టేబుల్ సమావేశం

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అవసరమా? అనివార్యమా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

విశాఖ

విశాఖ

విశాఖపట్నంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న దృశ్యం. ఈ దీక్షలో ఒకరు ఎన్టీఆర్ వేషధారణలో అలరించారు.

టిఎస్సార్

టిఎస్సార్

విశాఖపట్నంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మోకాళ్ల పైన కూర్చొని దీక్ష చేస్తున్న దృశ్యం.

తెలుగుదేశం

తెలుగుదేశం

విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఓ చోట ఉల్లిగడ్డలతో రాష్ట్ర చిత్రాన్ని తయారు చేసి నిరసన తెలుపుతున్న దృశ్యం.

మోకరిల్లారు!

మోకరిల్లారు!

విశాఖపట్నంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వేషధారి ముందు మోకరిల్లిన తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి వేషధారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+